శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2020 12:33 PM IST
శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీప్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీప్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు కోరుకుంటున్నారు.

నిన్న 10,004 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,30,526 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 1,00,276మంది చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి 3,969 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానానికి చేరింది. 7,80,689 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.

Next Story