ఏపీని వణికిస్తున్న కరోనా.. 152కు చేరిన కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 April 2020 7:09 AM ISTఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మూడ్రోజుల వ్యవధిలో సుమారు 90 కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచే గుర్తించారు. ఇంకా ఢిల్లీ నుంచి వచ్చినవారేవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి రక్తపరీక్షలు చేయించుకోవాలంటు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి 152 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికంగా కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
ఇటు తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ నుంచి 2200 మంది ఢిల్లీ కి వెళ్లొచ్చారని గుర్తించారు. ప్రస్తుతం 127 కేసులు నమోదవ్వగా..14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 9 మంది కరోనాతో మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా అయితే కరోనా బాధితుల సంఖ్య 2000 దాటింది. 50 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరింత విజృంభించక ముందే కట్టడి చేయాలంటే ప్రజలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.