ఏపీలో మరో 299 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 12:59 PM ISTఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,923 శాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,854 కి చేరింది. కొవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 92 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,983మంది డిశ్చార్జి కాగా.. 2779మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
మండలికి అంతమంది మంత్రులు ఎందుకంటే?Next Story