ఏపీలో కొత్తగా 218 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 1:02 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,384 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 218 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో 136 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 82 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 5,247కేసులు నమోదయ్యాయి.
వీరిలో ఏపీలో 4126, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 933, విదేశాల నుంచి వచ్చిన వారు 188 మంది ఉన్నారు. 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2475 మంది డిశ్చార్జి కాగా.. 1573మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story