ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24గంట్లలో 98 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 12:20 PM IST
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24గంట్లలో 98 కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 9,986 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 98 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377 కి చేరింది. కరోనా వల్ల గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య 71కి చేరింది.

మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,273మంది డిశ్చార్జి కాగా.. 1033మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 119 మందికి కరోనా సోకింది. ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 616 మంది కరోనా బారినప‌డిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

AP corona cases rise to 3279

Next Story