ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 5:35 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారు

క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిచ‌డంతో ఎంసెట్ స‌హా అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. తాజాగా ఏపీలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను బుధ‌వారం ఉన్నత విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఎంసెట్‌తో పాటు లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌, ఈసెట్ ల ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గడువును మే 20 వ‌ర‌కు పొడించిన‌ట్లు విద్యామండ‌లి చెర్మ‌న్ తెలిపారు.

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు..

జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌

జులై 24న ఈసెట్‌

జులై 25న ఐసెట్‌

ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీసెట్‌

ఆగస్టు 5న ఎడ్‌సెట్‌

ఆగస్టు 6న లాసెట్‌

ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు

Next Story