ఏపీ దిశ చట్టం.. సీఎం జగన్‌కు అభినందనల వెల్లువ..!

By అంజి  Published on  12 Dec 2019 10:17 AM GMT
ఏపీ దిశ చట్టం.. సీఎం జగన్‌కు అభినందనల వెల్లువ..!

ముఖ్యాంశాలు

  • సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా మంత్రులు
  • సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన మహిళా ఎమ్మెల్యేలు
  • ఏపీ దిశ చట్టం తీసుకురావడంపై అభినందనలు

అమరావతి: దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, మహిళ ఎమ్మెల్యేలు రాఖీ కట్టారు. జగన్‌కు స్వీట్లు తినిపించారు. మహిళల భద్రత, రక్షణ విషయంలోనే కాకుండా అత్యాచారాలు చేసిన నిందితులకు 21 రోజుల్లో శిక్షలు అమలు చేసే విధంగా కొత్త చట్టం తీసుకురావటంపై అభినందనలు తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకురావడాన్ని స్వాగతించారు. చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటంపైనా మహిళా ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దగ్గర ఆనందం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటూ కొత్త చట్టాలను తీసుకురావటంలో దేశంలోనే ఏపీ రాష్ట్రం ముందు ఉందని ప్రసంశించారు.

Next Story
Share it