దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో నలుగురు మృతదేహాల దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో నలుగురు మృతదేహాల అప్పగింత పై విచారణను హై కోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంపై అప్పుడే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది. నిందితుల మృతదేహాలను అప్పగించే విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని హై కోర్టు అడ్వకేట్ జనరల్ కు సూచించింది.

ఈ ఎన్‌కౌంటర్‌ పూర్తిగా అనుమానాస్పదమని సుప్రీంకోర్టు పేర్కొంది. నలుగురు నిందితులు పోలీసుపై దాడి చేశారా? వారు లాగిన పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపారా? అని కోర్టు ప్రశ్నించింది. నిందితుల బుల్లెట్‌ పోలీసులకు తాకలేదని సీజేకి న్యాయవాది రోహత్గి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తున్నామని ముకుల్‌ రోహత్గి తెలిపారు. కాగా పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారని తెలిపారు.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్‌కౌంటర్‌పై వీఎస్‌ సిర్‌పుర్కార్‌ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ వీఎస్ సిర్‌పుర్కార్‌, బాంబే హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ రేఖ, రిటైర్డ్‌ సీబీఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ను నియమించిన సుప్రీంకోర్టు నియమించింది. కమిషన్‌కు సీఆర్ఫీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని.. కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింవది. కమిషన్‌ విచారణపై మీడియా కవరేజ్‌ ఉండకూడదని పేర్కొంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.