వ‌ర‌ద బాధితుల‌కు సాయం ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 8:43 AM GMT
వ‌ర‌ద బాధితుల‌కు సాయం ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాల‌ని ఆదేశించారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం కావాల‌ని సీఎం పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. రానున్న మూడు రోజుల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టనున్న నేఫ‌థ్యంలో 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారుల‌ను ఆదేశించారు. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం వైఎస్‌ జగన్ సూచించారు.

Next Story