కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ...ఈ కీలక అంశాలపైనే చర్చ
By Newsmeter.Network Published on 27 Nov 2019 11:16 AM ISTఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలో కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల ముందు జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీలో తీసుకురానున్న కీలక బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల పై , అలాగే కొత్త బార్ల పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి మార్పులు చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం తెలుపునున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం లో మైనింగ్ లీజుల రద్దు పై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. వైఎస్సార్ నవశకం కార్యక్రమం అమలు తీరుపై చర్చ మంత్రివర్గం చర్చించనుంది. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే దీర్ఘ వ్యాధులతో బాధ పడుతూ, శాస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం అందించే అంశంపై కూడా కేబినెట్ ఆమోద ముద్రవేయనుంది. ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీపై, దాని విధివిధానాలుపై చర్చించనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.