ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఎన్‌పీఆర్‌పై తీర్మానం కూడా..

By అంజి  Published on  4 March 2020 9:43 AM GMT
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఎన్‌పీఆర్‌పై తీర్మానం కూడా..

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. బుధవారం సచివాలయంలో జరిగిన కేబినేట్‌ భేటీలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించారు. నేషనల్‌ పాపులేషన్‌ రిజస్టర్‌లోని కొన్ని అంశాలపై కేబినెట్‌ చర్చించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై కూడా చర్చించారు. ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై మంత్రి వర్గం చర్చించింది. రాష్ట్ర బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలతో పాటు ఓడరేవుల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర 16,164 ఎకరాల భూమి కొనుగోలు చేశామన్నారు. ఎన్పీఆర్‌లో మార్పులు కోరుతూ తీర్మానం చేపట్టామన్నారు. ఇళ్ల పట్టాలపై లబ్దిదారులకు పూర్తి హక్కు ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఐదేళ్ల తర్వాత భూమి అమ్ముకునే అవకాశం కల్పించేలా పట్టా ఇస్తామన్నారు.

ఎన్పీఆర్‌లో మార్పులు కోరుతూ తీర్మానం చేపట్టామన్నారు. జనగణనపై 20191లో ఇచ్చిన ప్రశ్నావళిపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, 2010 ప్రశ్నావళి ఆధారం గానే జనగణ న చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. దీని కోసం కేంద్రానికి కేబినెట్‌ తీర్మానం పంపుతున్నామని తెలియజేశారు. అప్పటి వరకు ఏపీలో జనగణన ప్రక్రియను వాయిదా వేస్తున్నామన్నారు.

ఏపీ సీడ్స్‌కు రూ.500 కేటాయించేలా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌కు రైతులకు అందుబాటులో విత్తనాలు ఉంటాయన్నారు. విజయవాడ, కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లు పూర్తి చేసేందుకు రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

అమరావతిలో భూ అక్రమాలపై సమగ్ర విచారణకు సిట్‌కు అధికారం ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. అధికారం లేనప్పుడు చంద్రబాబుకు అందరూ కావాలి అని, 2019లో బీసీలకు చంద్రబాబు ఎన్ని టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీ మంత్రులు లేరని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

Next Story