ఏపీ బీజేపీ నేతల సమావేశం

By అంజి
Published on : 17 Feb 2020 3:32 PM IST

ఏపీ బీజేపీ నేతల సమావేశం

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

AP BJP leaders meeting

క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రధాని మోదీ పాలన, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు గ్రామాల్లో ప్రచారం చేయాలని కన్నా సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎనిమిది నెలల పాలనలో వైఫల్యాలు, పెన్షన్‌ల రద్దు వంటివి ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు అవకాశం ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు చెప్పారు.

AP BJP leaders meeting AP BJP leaders meeting AP BJP leaders meeting

Next Story