అమరావతి: శీతాకాల శాసన సభ సమావేశాలను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కార్ ప్రవేశ పెట్టనుంది. జూన్‌లో వర్షాకాల సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం.. ఆరు నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపర్చాలి. ఈ నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించింది.