ఏపీ రాష్ట్రమో, దేశమో చెప్పలేని లోకేష్.. అమెరికా వెళ్లింది అందుకేనా..!
By సుభాష్ Published on 10 Dec 2019 8:11 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి. సమావేశాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగాయి. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...చంద్రబాబు ఆయన నారా లోకేష్‌ను అమెరికాలో చదివించానని గొప్పలు చెప్పుకొంటున్నారని, కానీ లోకేష్ కు జయంతి, వర్థంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాష్ట్రమో.. దేశమో చెప్పలేని స్థితిలో లోకేష్ ఉన్నాడని రోజా ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లి చదివింది అందుకేనా అంటూ చురకలంటించారు. దీన్ని బట్టి చూస్తూ చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయినట్లు అర్థమవుతోందని అన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పుపాలయ్యారని, ఇది నిజం కాదా అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌లపై రోజా సెటైర్లు వేశారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదని, రైతులను నట్టేట ముంచాడని ధ్వజమెత్తాడు. గడిచిన ఐదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో జనాలకు తెలుసని, అందుకు ఇటీవల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. జగన్ హయంలో జరుగుతున్నఅభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలు సృష్టించే పనిలో ఉన్నారన్నారు.