రాజధాని రైతుల మరో సంచలన నిర్ణయం..!
By సుభాష్ Published on 2 Jan 2020 7:43 PM ISTముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని రైతులు మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఆందోళన బాట పట్టారు. రైతులు చేస్తున్న నిరసనలు 16వ రోజుకు చేరాయి. ఇక ఉధ్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రైతులు ఈనెల 3 నుంచి సకలజనుల సమ్మెకు దిగుతున్నారు. నిత్యావసరాలు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవసరాలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటిని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి చుట్టుపక్కల ఉన్న 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది.
కాగా, రాజధానిపై ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ తన నివేదికను సర్కార్‌కు అందజేసింది. శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించబోతోంది. ప్రభుత్వం ఇటీవల రాజధాని, ఏపీ సమగ్ర అభివృద్ధిపై హైపర్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక మరో 15 రోజుల్లో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్ని నివేదికలను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఒక వైపు కర్నూలును పరిపాలన రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తుండగా, మరో వైపు అమరావతిలో ఉన్న సచివాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ మూడు రాజధానుల గొడవ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందే వేచి చూడాలి.