అమరావతి: రాజధాని, సీఆర్డీఏ బిల్లులపై వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానుల బిల్లును మనీ బిల్లు అంటూ పిటిషనర్‌ తరఫు లాయర్‌ అశోక్‌ భను వాదనలు వినిపించారు. అది మనీ బిల్లు కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముఖుల రోహత్గీ కోర్టుకు తెలిపారు. బిల్లు ఏ దశలో ఉందని అడిగిన న్యాయమూర్తి అడగగా.. ఏజీ స్పందించి మండలిలో సెలెక్ట్‌ కమిటీకి పంపించారని తెలిపారు. అలాగు బిల్లులు రెండు సాధారణ బిల్లులేనన్నారు. కాగా తుదుపరి విచారణణు హైకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. కేసులు పెండింగ్‌లో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తే వాటి ఖర్చును సంబంధిత అధికారులు బ్యాంక్ ఖాతాల నుంచి రీకవరీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

రాజధానికి సంబంధించి అన్ని కేసుల విచారణ ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లుపై ఏపీ శాసనసభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. హైకోర్టు విచారణ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని హాజరయ్యారు. ఇరు పక్షాల విన్న ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, సీఆర్డీఏ బిల్లులపై వేసిన పిటిషన్లపై విచారించేందుకు హైకోర్టు స్పెషల్‌ బెంచ్‌ ఏర్పాటు చేసింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయమూర్తిలతో కూడిన ధర్మాసననం ఈ బిల్లులపై విచారణ జరిపింది. కాగా సెలెక్ట్‌ కమిటీ నివేదిక అందించేందుకు 3 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.