పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

By సుభాష్  Published on  14 April 2020 2:27 PM IST
పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

దేశంలో కరోనా వైరస్‌ కారణంగా ఏపీలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ తాజాగా కూడా మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇప్పటికే అన్ని తరగతులతో పాటు పదో తరగతి పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఇక లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించినందున పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తామని ప్రకటించారు. దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పరీక్షలు నిర్వహించేంత వరకూ ఈ ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.

ఆన్‌లైన్‌ తరగతులకు 'విద్యామృతం' అనే పేరుతో కార్యక్రమం ప్రసారం అవుతుందని చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సప్తగిరి ఛానల్‌ ద్వారా ప్రసారమవుతాయని, ఈ క్లాసులను పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అంతేకాకుండా ఇవే క్లాసులను యూట్యూబ్‌ సప్తగిరి ఛానల్‌లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Next Story