రూ.50వేలకు పరుగులు పెడుతున్న బంగారం ధర

By సుభాష్  Published on  14 April 2020 7:25 AM GMT
రూ.50వేలకు పరుగులు పెడుతున్న బంగారం ధర

పసిడి పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు రికార్డుస్థాయిలో పెరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 46వేలు దాటి.. రూ.50వేలకు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌ వేళ బంగారం షాపుల్లో కొనుగోళ్లు తగ్గినా..ధర మాత్రం పరుగులు పెడుతోంది.

ఈ ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేనట్లు తెలుస్తోంది. చివరి వరకు రూ.55వేల వరకు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2020లో ఇప్పటి వరకూ పసిడి ధర 17.31 శాతం మేరకు అంటే రూ.6వేల795 వరకు ఎగబాకింది. ఇందే ట్రెండ్‌ కొనసాగితే ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయికి చేరే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇందుకు కారణం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులేనని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ ఏడాది ఔన్స్‌ పసిడి ధర 1800 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. 10 గ్రాముల బంగారం ధర 50వేల నుంచి 55వేల మధ్య ట్రేడ్‌ కావచ్చు. బంగారం కొనాలనుకునేవారు సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పద్దతిలో కొనడం మంచిదని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story
Share it