గాంధీ జయంతి సందర్భంగా అనుష్క 'నిశ్శబ్దం'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 1:08 PM GMT
గాంధీ జయంతి సందర్భంగా అనుష్క నిశ్శబ్దం

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబద్ధం'. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వినపడుతున్న వార్తలకు చెక్‌ పడింది. అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. అటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ”మీ నిశ్శబ్దం మిమ్మల్ని కాపాడుతుంది. తెలుగు, తమిళ్‌, మలయాళంలో అక్టోబర్ 2న నిశ్శబ్దం ప్రీమియర్ అవ్వనుంది” అని వెల్లడించింది.

తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళ భాషల్లో సైలెన్స్‌ అనే పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. విడుదల తేదీన ట్విట్టర్‌లో పోస్టు చేసిన అనుష్క శెట్టి 'నీ సైలెన్సే నిన్ను కాపాడుతుంది' అనే మెసేజ్‌ను కూడా షేర్‌ చేశారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కోన వెంకట్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయాలని నిర్మాతలు బావించారు. కానీ.. లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌న్న దానిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

Next Story