కాల్ సెంటర్ ఎఫెక్ట్: సీఐ సస్పెన్షన్..!

By Newsmeter.Network  Published on  2 Dec 2019 8:38 PM IST
కాల్ సెంటర్ ఎఫెక్ట్: సీఐ సస్పెన్షన్..!

ఏపీలోని కాల్ సెంటర్‌ ఎఫెక్టుకు సీఐ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో డీఐజీ సీఐని సస్పెండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు రావడంతో.. డీఐజీ కాంతిరాణా విచారణకు ఆదేశించారు. కాగా, మల్లికార్జున్ దాదాపు కోటి రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డ‌డంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ కాల్ సెంటర్ కార్యక్రమం ఎఫెక్టు బాగానే ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈకాల్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డంతో ఇలాంటి లంచాధికారుల భ‌ర‌తం ప‌ట్టేందుకు ప్ర‌జ‌లు ఫిర్యాదులు చేసేందుకు వెనుకాడ‌టం లేదు.

Next Story