మహబూబాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడు ఆవుల నరేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ డ్రైవర్‌ నరేశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గత 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా ఆవుల నరేశ్‌ పని చేస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నరేశ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తుండగానే నరేశ్‌ మృతిచెందాడు.

Tsrtc2

మృతుడు నరేశ్‌కు భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు. నరేశ్‌ భార్య పూలమ్మ గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మరో వైపు పిల్లల చదువులతో నరేశ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని తోటి కార్మికులు తెలిపారు. నరేశ్‌కు ఆత్మహత్య విషయం తెలుసుకున్న కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. నరేశ్‌ మృతదేహంతో కార్మికులు ర్యాలీకి యత్నించారు. దీంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు.

Letter3 Letter2 Letter1 Letter

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.