ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె కమలం పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో జకియా ఖానం బీజేపీ కండువా కప్పుకున్నారు.
కాగా శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. ఇక బీజేపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.