నిరూపించే ధైర్యం ఉందా.? : వైవీ సుబ్బారెడ్డి

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లుకు రాజ్య‌స‌భ కూడా ఆమోదం తెలిపింది.

By Medi Samrat
Published on : 4 April 2025 9:08 PM IST

నిరూపించే ధైర్యం ఉందా.? : వైవీ సుబ్బారెడ్డి

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లుకు రాజ్య‌స‌భ కూడా ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్య‌తిరేకంగా 95 ఓట్లు వ‌చ్చాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు 24 గంట‌ల త‌ర్వాత ఎగువ స‌భ‌లో కూడా ఆమోదం పొందింది. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ‌క్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే వాదనల్లో నిజం లేదన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘మేం వ్యతిరేకించామనడానికి లోక్ సభ, రాజ్యసభల్లో రికార్డయిని ఉభయసభల కార్యాకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా?, నిరూపించమని సవాల్ విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ట్వీట్ పెట్టారు.

Next Story