అచ్చెన్న కాబోయే హోంమంత్రి.. పిచ్చి అందరికీ అంటించాడు బాబు

YSRCP MP Vijayasai Reddy slams TDP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2021 10:17 AM GMT
Vijayasai Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు వేశారు. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న్ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో అచ్చెన్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని, చంద్ర‌బాబు అడిగి హోం మినిస్ట‌ర్‌ను అవుతాన‌ని పోలీసుల‌తో అన్నారు. అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి సెటైర్ వేశాడు.


'కాబోయే హోం మినిష్టర్ అచ్చెన్నంట. క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించడానికి బిస్కెట్ వేశాడు. చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటాడు. బహిరంగపరిస్తే ఎలా అచ్చెన్నా. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారంట. పిచ్చి అందరికీ అంటించాడు బాబు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


ఇక అంతకు ముందు ట్వీట్‌ లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 'పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి? ' అంటూ విజయసాయిరెడ్డి విమ‌ర్శించారు.


Next Story
Share it