పార్లమెంట్ లో సూపర్ సిక్స్ ప్రస్తావన

పార్లమెంట్ లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించారు.

By Medi Samrat  Published on  29 July 2024 8:26 PM IST
పార్లమెంట్ లో సూపర్ సిక్స్ ప్రస్తావన

పార్లమెంట్ లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని .. ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడం లేదన్నారు. సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారని.. నా వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు మిథున్ రెడ్డి. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలని పార్లమెంట్ లో గళం వినిపించారు మిథున్ రెడ్డి.

Next Story