ఏపీలో టీడీపీ హింసకు పాల్పడుతుంది.. రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ నాయకత్వం, కార్యకర్తలపై అధికార టీడీపీ హింసకు పాల్పడుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఆరోపించారు

By Medi Samrat
Published on : 2 July 2024 4:05 PM IST

ఏపీలో టీడీపీ హింసకు పాల్పడుతుంది.. రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ నాయకత్వం, కార్యకర్తలపై అధికార టీడీపీ హింసకు పాల్పడుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక కేటగిరీ హోదా అనేది కేవలం డిమాండ్ మాత్రమే కాదని.. “అన్యాయమైన విభజన కారణంగా.. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కు” అని ఉద్ఘాటించారు.

“ప్రత్యేక కేటగిరీ హోదాను డిమాండ్ చేయకుండా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై, కార్యకర్తలపై హింసను ప్రోత్స‌హిస్తుంద‌ని అని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టాలని ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీని కోరారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆయ‌న కేంద్రాన్ని కోరారు.

వైద్య విద్య ఆందోళనలను ప్రస్తావిస్తూ.. NEET-UG సీట్లను ప్రస్తుతమున్న‌ 55,648 నుండి 1 లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఆశావాదుల సంఖ్య నేప‌థ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల గణనీయమైన కొరతను ఆయ‌న ఎత్తిచూపారు.

Next Story