పవన్ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే విమాన ప్రయాణానికే ఖర్చు ఎక్కువ : పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విరుచుకుపడ్డారు.
By M.S.R Published on 25 Nov 2023 9:00 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బులు లేవని చెబుతాడు కానీ ఆయన వద్ద చాలా డబ్బులున్నాయని ఆరోపించారు పేర్ని నాని. పవన్ దగ్గర డబ్బులు లేకుంటే చార్టెడ్ ఫ్లైట్‌లో ఎలా వస్తాడన్నారు. పవన్ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ అనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. విమానం రానివ్వపోవడానికి మాకేం పని. విమానం దొరకలేదని ఏడవచ్చు కదా.. సిగ్గులేని మాటలు దేనికి. ఇంటెలిజెన్స్ ఆపితే విమానంలో ఎలా వచ్చావ్.. ఎలా వెళ్లావ్ పవన్?. నువ్వు శాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమే. చంద్రబాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే పవన్ పనిచేస్తున్నాడన్నారు పేర్ని నాని.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారిందని.. మత్స్యకారులకు సీఎం జగన్ ఏమీ చేయడం లేదని పవన్ అంటున్నాడు.. సీఎం జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయని, శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు పేర్ని నాని. పవన్ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ డబ్బులిచ్చి వెళ్లే సరికే సీఎం జగన్ ప్రభుత్వం రూ.7కోట్ల 11లక్షల పరిహారం ఇచ్చింది. పవన్‌కు కావాలంటే ఎవరెవరికి డబ్బులు ముట్టాయో పేర్లతో సహా లిస్ట్ ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు నువ్వు, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా సమాధానం చెప్పాలన్నారు పేర్ని నాని.