నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు

YSRCP MLA Kotamreddy Sridhar Reddy Fallen Sick. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు.

By Medi Samrat  Published on  27 May 2022 6:57 PM IST
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ఆయన 'జగనన్న మాట.. కోటంరెడ్డి బాట' అనే కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉండగా ఆయన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే ఆయనను నెల్లూరులోని ఆపోలో ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశారు. నెల్లూరు ఆసుపత్రిలో కోటంరెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్యాహ్నానికి ఛాతీలో నొప్పి ఎక్కువగా రావటంతో ఆయన్నునెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించామని కార్యకర్తలు తెలిపారు. డాక్టర్లు ఆయన్ను పరీక్షించి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆయన్ను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.










Next Story