ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారు : కొడాని నాని

YSRCP MLA Kodali Nani Sensational Comments On TDP. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీని స్వాధీనం చేసుకోబోయే వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 28 May 2023 5:30 PM IST

ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారు : కొడాని నాని

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీని స్వాధీనం చేసుకోబోయే వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని అన్నారు.ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారని.. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేశ్ ను తరిమికొట్టి.. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని, చంద్రబాబు అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని.. చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని అన్నారు.


Next Story