ఏపీలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి : కొడాలి నాని

ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ సీనియ‌ర్ నేత‌, గుడివాడ‌ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు

By Medi Samrat  Published on  11 April 2024 6:15 PM IST
ఏపీలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి : కొడాలి నాని

ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ సీనియ‌ర్ నేత‌, గుడివాడ‌ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప‌ట్ట‌ణంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలని ఆయన వెల్లడించారు. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అర్హులకు లబ్ధిని చేకూర్చిన సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమేనని అన్నారు. అడ్డూ అదుపు లేకుండా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్దాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ఆయనకు ఇవే చివరి ఎన్నికలని నాని జోస్యం చెప్పారు.

గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణ 30వ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని చేప‌ట్టిన‌ గడపగడపకు ప్రచారానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత వార్డులోని ఐశ్వర్యాంబిక దేవస్థానం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు.. ప్రజానీకం గజ మాలలతో ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని కొస‌నాగించారు.

Next Story