లోకేష్ ఢిల్లీ టూర్ పై వైసీపీ అటాక్ షురూ

టీడీపీ నేత నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  15 Sept 2023 9:15 PM IST
లోకేష్ ఢిల్లీ టూర్ పై వైసీపీ అటాక్ షురూ

టీడీపీ నేత నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే..! లోకేష్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలకు, జాతీయ మీడియాకు ఏం చెబుతారని వైసీపీ నేత, మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి మా తండ్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్లు నొక్కేశాడని, హవాలా రూపంలో వాటిని తరలించి తాము కొట్టేశామని జాతీయ మీడియాకు చెబుతారా? అని ప్రశ్నించారు. జీ20 సదస్సు కారణంగా ఇప్పటి వరకు మీ అయ్య చంద్రబాబు చరిత్ర ఏపీకి మాత్రమే తెలిసిందని, ఇప్పుడు లోకేశ్ తనంతట తాను వెళ్లి ఆయన తండ్రి నిజస్వరూపాన్ని జాతీయ మీడియా ముందు చెబుతాడట? అని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లడం, ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక న్యాయవాదిని తీసుకురావడం చూస్తుంటే వీరు ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారో అర్థమవుతోందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారుతాయా? అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. లోకేశ్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పెళ్లి ఒకరితో సంసారం మరొకరితో అన్నట్లుగా ఉందన్నారు. జైలుకెళ్లి సాష్టాంగ నమస్కారంతో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని అన్నారు.

Next Story