ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడలేదు: రోజా

బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

By -  అంజి
Published on : 3 March 2026 7:10 PM IST

YSRCP, RK Roja, TTD Chairman, BR Naidu, APnews

ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడలేదు: రోజా

బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ నాయుడికి మహిళలంటే గౌరవం లేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రోజా కోరారు.

దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడిన దాఖ‌లాలు లేవని, చైర్మన్‌గా హుందాగా, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యతను బీఆర్ నాయుడు పాటించలేదన్నారు. లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏక‌స‌భ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనవసరమన్నారు. ఇందాపూర్ డెయిరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అధిక ధరలకు కట్టబెట్టడంపై కూడా అనుమానాలు ఉన్నాయని రోజా అన్నారు.

Next Story