రజనీకాంత్ వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఫైర్

YSRCP Leader Laxmi Parvathi Fire On Rajini Kanth. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును

By Medi Samrat  Published on  29 April 2023 12:45 PM GMT
రజనీకాంత్ వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఫైర్

YSRCP Leader Laxmi Parvathi


ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పొగుడుతూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి రజనీకాంత్ తీరుపై మండిపడ్డారు. రజనీకాంత్ కు బుద్ధీ ఙ్ఞానం లేదని విరుచుకుపడ్డారు. చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన విషయాలు తెలియవా?? అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను రాజకీయ హత్య చేసిన వ్యక్తికి రజనీకాంత్ ఎలా మద్దతు ఇస్తారు.. ఎన్టీఆర్ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని వ్యక్తులు ఆ వేదిక పై ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ ఎందుకు ఖండించ లేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబును పొగడటానికి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారా.. ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహమే రజనీకాంత్ కూడా చేశాడని అన్నారు. రజనీకాంత్, చంద్రబాబు ఇద్దరూ పిరికి వాళ్ళు. బీజేపీతో చేతులు కలపటానికి రజనీకాంత్ ను చంద్రబాబు పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రజనీకాంత్ వ్యాఖ్యల ప్రభావం ప్రజలపై ఉండదన్నారు లక్ష్మీపార్వతి.

రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలను రజనీకాంత్ నమ్మొద్దని కోరారు. చంద్రబాబుకు సొంత కొడుకు మీద నమ్మకం లేక అద్దె కొడుకుని తెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌పై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని, కానీ అదంతా కపట ప్రేమని అన్నారు. ఎందరినో ప్రధానులను చేశానని.. మరెందరికో భారతరత్న ఇప్పించానని చెప్పుకునే చంద్రబాబు మరి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని మార్గాని భరత్ ప్రశ్నించారు.


Next Story