ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజనీకాంత్ చదివారు : కొడాలి నాని

Kodali Nani Fire On Rajini Kanth. ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజినీకాంత్..

By Medi Samrat  Published on  29 April 2023 2:45 PM IST
ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజనీకాంత్ చదివారు : కొడాలి నాని

ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు అని కొడాలి నాని అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలెవరూ పట్టించుకోరని చురకలు అంటించారు. ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశారు.. ఇప్పుడేమి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజనీకాంత్ చదువుతూ మరింత దిగజారుతున్నాడని నిప్పులు చెరిగారు.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ కూడా చంద్రబాబుతో చేతులు కలిపాడన్న విషయం అందరికీ తెలుసు అని, అటువంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తాననటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.


Next Story