అమరావతి: మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అస్వస్థతకు గురైనట్టు వైసీపీ ట్వీట్ చేసింది. 'జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు' అని తెలిపింది. వైఎస్ జగన్‌కు జ్వరం వచ్చిందని తెలిసి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
ప్రస్తుతం మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ జగన్ పులివెందులకి వచ్చారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను సొంత ఊరిలో, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారాయన. అయితే ఈ ఉదయం వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారని వైసీపీ తన అధికార ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకుంటోన్నారు.