టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుతో వీడియోల్లో కనిపిస్తున్న మహిళ గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు లేఖ రాసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ లేఖలో తనతో ఆయనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం, అది ఒక రిలేషన్‌షిప్‌గా మారిన వైనం, ఆపై తను ఎదుర్కొన్న మానసిక వేధింపులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు బెదిరింపులను ఆమె వివరించినట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.
తన కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో కూడా తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఇటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ వంటి అత్యున్నత పదవిలో కూర్చోబెడితే ఆ సంస్థ గౌరవానికి, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం బయటకు వచ్చిన వీడియోల నేపథ్యంలో ఆ లేఖలోని ప్రతి అక్షరం నిజమనిపిస్తోందని, తక్షణమే బి.ఆర్. నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.