భోగాపురంలో తొలి విమానం ల్యాండ్‌..వైసీపీ పునాదే కారణమని జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 3:04 PM IST

Andrapradesh, Vishakapatnam, Bhogapuram International Airport, YSRCP chief Jagan, Ap Government

భోగాపురంలో తొలి విమానం ల్యాండ్‌..వైసీపీ పునాదే కారణమని జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదే కారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది.

అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది..అని జగన్ ఎక్స్‌లో రాశారు.

Next Story