వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా: నగదు జమ చేసి సీఎం జగన్
నిరుపేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు అండగా నిలిచే వైఎస్‌ఆర్ కల్యాణమస్తు , వైఎస్‌ఆర్ షాదీ తోఫా పథకాల కింద
By అంజి Published on 5 May 2023 2:15 PM IST
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా: నగదు జమ చేసి సీఎం జగన్
నిరుపేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు అండగా నిలిచే వైఎస్‌ఆర్ కల్యాణమస్తు , వైఎస్‌ఆర్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు జమ చేశారు . తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి-మార్చి త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు అందించిన సాయంతో పాటు గత ఆరు నెలల్లోనే 16,668 మంది లబ్ధిదారులు ఈ పథకాల కింద లబ్ధి పొందారు. వీరి ఖాతాల్లో ప్రభుత్వం రూ.125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేద పిల్లలు చదువుకునేలా వివాహ అర్హత కోసం 10వ తరగతి తప్పనిసరిగా చదవాలనే నిబంధన తీసుకొచ్చారన్నారు.
కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులు ఎస్‌ఎస్‌సీ అర్హత కలిగి ఉంటేనే అందజేస్తారు. ఇలా 10వ తరగతి వరకైనా చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో పెరుగుతుందన్నారు. ఈ స్కీమ్‌లకు అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు కనీస వయస్సుగా నిర్దారించామని తెలిపారు. 18 ఏళ్ల నిబంధన వల్ల ఆడపిల్లలు చదువుకునే అవకాశం ఉందన్నారు. కనీసం డిగ్రీ వరకు చదువుకునే వెసులుబాటు ఉంటుందని, దీంతో ప్రతి పేద కుటుంబం ఉన్నతస్థాయికి చేరుకుంటుందని సీఎం అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఉండటం వల్ల కనీసం డిగ్రీ వరకు చదువుతారని, పిల్లల చదువు భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్‌తో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రబాబు హయాంలో కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇస్తే.. ఇప్పుడు మనం లక్ష రూపాయలు ఇస్తున్నాం. గతంలో మాదిరిగా ఎన్నికల కోసం కాకుండా చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. - సీఎం వైయస్ జగన్#YSRKalyanaMasthu #YSRShaadiTohfa pic.twitter.com/B7LYlwjzJy
— YSR Congress Party (@YSRCParty) May 5, 2023