నీ చెల్లెల్ని హేళన చేస్తున్నారు.. వైఎస్ జగన్ నీకిది తగునా?: వైఎస్ వివేకా భార్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సీఎం జగన్‌కు తగునా అని వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.
By అంజి Published on 25 April 2024 12:09 PM ISTనీ చెల్లెల్ని హేళన చేస్తున్నారు.. వైఎస్ జగన్ నీకిది తగునా?: వైఎస్ వివేకా భార్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సీఎం జగన్‌కు తగునా అని వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన అనుభవించావో, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే బాధపడిందన్నారు. ''న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెల్ని హేళన చేస్తారా? సునీతకు మద్దతుగా నిలబడిన షర్మిలనూ టార్గెట్ చేస్తున్నారు. నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటీ?'' అని జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.
''2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.. 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశం. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం. నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈవిధంగా నీ పత్రిక, నీ టీవీ చానెల్,నే సోషల్ మీడియా.. నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా ?'' అని వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.
''న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.. నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.. నీకు మాత్రం పట్టడం లేదా ? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే.. నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి ? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ? ఇంకా బాధించే అంశం..హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం.. ఇది సమంజసమా ? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్న.. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా.. న్యాయం ధర్మం ఆలోచన చేయమని, నిన్ను ప్రార్థిస్తున్నా, రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని... ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్న'' అని సీఎం జగన్‌కు రాసిన లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు.