మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, నిష్పాక్షిక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.