మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వస్తే చీర, సారే పెట్టీ పంపుతాం.. మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారని దివంగత వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ అన్నారు. వైఎస్ షర్మిల ప్రచారం సభలో ఆమె మాట్లాడుతూ.. మన పులివెందుల ఆడ బిడ్డలు ఇద్దరు మీ ముందు ఉన్నారు. 5 ఏళ్లుగా పడుతున్న కష్టం మీకు తెలుసు.. న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చిందన్నారు. అందరం షర్మిలమ్మ కి ఓటు వేసి గెలిపిద్ధాం అని పిలుపునిచ్చారు. ఓటు వేసి షర్మిలమ్మ కొంగు నింపాలన్నారు.
ఓట్ల ద్వారా షర్మిల కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తుందన్నారు. షర్మిలమ్మను గెలిపించాల్సిన అవసరం మనకు ఉందన్నారు. తిరిగి మనం YSR పాలన చూడాలి అంతే షర్మిల తోనే సాధ్యమన్నారు. వివేకా షర్మిలను ఎంపీ చేయాలని అనుకున్నాడు.. అది అప్పట్లో జరగలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా షర్మిల ను గెలిపించి రాజన్న పాలన చూడాలన్నారు.