వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ అయిన వైఎస్ సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్ సునీత తరపు లాయర్ కోరారు. అయితే సీబీఐ ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు గుర్తు ప్రస్తావించింది. అంతకు ముందు సీబీఐ తరపు లాయర్ కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది.