ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వైఎస్ విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో అదుపుతప్పింది. అయితే డ్రైవర్ కారును అదపు చేయడంతో పెను ప్రమాదం నుంచి విజయమ్మ బయటపడిందని సమాచారం.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడు అయ్యపురెడ్డి ఫ్యామిలీని పరామర్శించేందుకు విజయమ్మ కర్నూలుకు వచ్చారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకుపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం నుంచి విజయమ్మ తప్పించుకోగలిగారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడి నుంచి విజయమ్మ మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు.