ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా?, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అంటూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడగగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స్పందించారు. తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని, ఆ విధంగానే ముందకెళ్తున్నామని వైఎష్ షర్మిల చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సొంతా అన్నా చెల్లెలు అయినా గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్‌కు, వైఎస్ షర్మిలకు పొసగడం లేదని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని వార్తలు వచ్చాయి. ఇటీవల సొంతూరు ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ సెలబ్రెషన్స్‌లోనూ అన్నా చెల్లెళ్ల మధ్య విబేధాలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో వారికే తెలియాలి. ఇప్పటికే తెలంగాణలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల బహిరంగ సభలు జరుపుతూ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.