సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  30 March 2024 5:30 PM IST
సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడారని.. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి మోసం చేశారన్నారు. వైసీపీ తరపున గెలుపొందిన 23 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారన్నారు.

విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఇక త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీ అసెంబ్లీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Next Story