కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు

By -  Medi Samrat
Published on : 18 Dec 2025 4:58 PM IST

కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తన కుమారుడిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా! ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నీ విశ్వాసం, ఉత్సాహం, పట్టుదల నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తాయి. నీ ఆత్మ వర్ధిల్లినట్లే, నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లి ఆరోగ్యంగా ఉండాలి! మరెన్నో సాహసాలు, విజయాలతో నిండిన మరో సంవత్సరం నీకు దక్కాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను! అమ్మ" అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు.

Next Story