ఏపీ మందు బ్రాండ్ల‌పై షర్మిల సెటైర్లు

ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని APCC చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  11 May 2024 9:42 AM GMT
ఏపీ మందు బ్రాండ్ల‌పై షర్మిల సెటైర్లు

ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని APCC చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కడప జిల్లాలో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ నెరవేరలేదన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందన్నారు. అలాంటి బీజేపీతో బాబు పొత్తు.. జగన్ మోహన్ రెడ్డి తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. విభజన హామీలు వెరవేర్చని బీజేపీతో ఎందుకు పొత్తులు, తొత్తులుగా మారారు? ప్ర‌శ్నించారు.

అందరికీ రాజధానులు ఉన్నాయి. మనకు చేతిలో చిప్ప ఉంది. నెత్తిమీద కుచ్చు టోపీ ఉంది. చంద్రబాబు సింగపూర్ అన్నాడు. జగన్ మూడు రాజధానులు అన్నాడు. వాషింగ్ టన్ DC తలపించే రాజధాని అన్నాడు. 10 ఏళ్ల తర్వాత గుండు సున్నా.. జగన్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. సంక్రాంతి కి జాబ్ క్యాలెండర్ అన్నాడు.. వచ్చిందా? మద్యపాన నిషేధం అన్నాడు.. చేశారా.? ప్రపంచంలో ఎక్కడ లేని బ్రాండ్ లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏది అమ్మితే అదే తాగాలి. బూమ్ బూమ్ అంట.. క్యాపిటల్ అంట.. ప్రెసిడెంట్ మెడల్ అంట. రాష్ట్రం మొత్తం మాఫీయా మయం. లిక్కర్ మాఫియా.. సాండ్ మాఫీయా.. భూ మాఫీయా మ‌యం అయ్యింద‌ని సెటైర్లు విసిరారు.

హత్యా రాజకీయాలు తప్పా మరోటి లేదు. వివేకాను గొడ్డలితో 7 సార్లు నరికారు. అటువంటి నిందితుడిని పక్కన పెట్టుకొని తిరుతున్నాడు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మారిపోయాడన్నారు. సీఎం అవ్వక ముందు YSR మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పాడు. సీఎం అయ్యాక వాళ్ళకే పిలిచి ఎంపీ పదవులు ఇచ్చారు. వివేకా మరణం తర్వాత CBI విచారణ అన్నాడు. సీఎం అయ్యాక CBI విచారణ అవసరం లేదు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ YSR పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని చెప్పాడు. నిజానికి CBI ఛార్జ్ షీట్ లో చేర్పించింది జగన్. రాజకీయాల కోసం నాన్న పేరును ఛార్జ్ షీట్ లో పెట్టించాడని ఆరోపించారు. YSR పేరు లేకుంటే బయటకు రాలేనని అనుకున్నాడు. అందుకే పొన్నవోలు తో పెట్టించాడు. అందుకు పొన్నవోలు సుధాకర్ కి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని అన్నారు.

ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుందన్నారు. కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా ? నేరాన్ని గెలిపిస్తారా ? అని ప్ర‌జ‌ల‌ను అడిగారు. YSR బిడ్డగా మాట ఇస్తున్నా.. ఈ గడ్డ బిడ్డగా ఇక్కడే బ్రతుకుతుంది. ఈ గడ్డ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా. YSR పాలన తిరిగి తెస్తాం. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలి అని కోరారు.

Next Story