సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పర్యవేక్షణలో కొత్త “స్వతంత్ర” ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

By Medi Samrat  Published on  4 Oct 2024 9:15 PM IST
సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పర్యవేక్షణలో కొత్త “స్వతంత్ర” ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. కొత్త సిట్ బృందంలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నుండి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) సీనియర్ అధికారి ఒకరు ఉంటారని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్ బెంచ్ తెలిపింది.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో మొట్టమొదట సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు షర్మిల. తిరుమల లడ్డు వివాదంపై గౌరవ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని, ఈ దర్యాప్తు బృందంలో సీబీఐ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, రాష్ట్ర పోలీసుల ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు వైఎస్ షర్మిల.

Next Story