మరోసారి డీకేను కలిసిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి బుధవారం బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్‌ నివాసానికి వెళ్లి కలిశారు

By Medi Samrat  Published on  10 April 2024 9:00 PM IST
మరోసారి డీకేను కలిసిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి బుధవారం బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్‌ నివాసానికి వెళ్లి కలిశారు. కేపీసీసీ అధ్యక్షుడితో నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయమై ఆమె మీడియాకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమావేశంలో డి.కె.శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ సీటు అభ్యర్థి డి.కె. సురేష్ కూడా పాల్గొన్నారు.

ఎన్నికలకు ముందు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story