పోలీస్ శాఖను తెరాసలో విలీనం చేయండి : షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila Fire On TRS. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  18 Sep 2022 10:40 AM GMT
పోలీస్ శాఖను తెరాసలో విలీనం చేయండి : షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని కుట్రపూరితంగా హత్య చేశారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తనను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పాదయాత్రను ఆపే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు.

తాను భేడీల‌కు భయపడనని అన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేసినందుకు తనపై కేసు పెట్టారని వైఎస్‌ షర్మిల అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఆయనపై కేసు న‌మోదు చేయలేదని ఆమె విమర్శించారు. నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్ర‌శ్నించారు. ఇదేనా తెలంగాణ లో మహిళల మీద గౌరవం.. తెలంగాణలో మంత్రుల మీద కేసులు వేయకూడదా...? నిల‌దీశారు.

నేను వైఎస్సార్ బిడ్డ అయి ఉండి కూడా కేసు పెడితే నమోదు చేయడం లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి..? అని ప్ర‌శ్నించారు. పోలీస్ శాఖను తెరాసలో విలీనం చేయండని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ లో ప్రజా స్వామ్యమే లేదని.. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమేన‌ని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.




Next Story